Posts

నాన్న ! నీతో ఓ గంట | Telugu Stories With Moral For Kids And Students

Image
ఒక తండ్రి రోజులా చీకటి పడ్డాక చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఆఫీసులో పని ఎక్కువగా ఉండడంతో అలసిపోయి చికాకుగా ఉన్నాడు. తండ్రి కోసం అతని పది సంవత్సరాల కొడుకు గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉన్నాడు.

‘నాన్నా, నిన్నో ప్రశ్న అడగనా?’ సంశయంగా అడిగాడు కొడుకు.

‘ఏమిటి?’

‘గంటకు  నువ్వెంత సంపాదిస్తావు?’

కొడుకు ప్రశ్న వినగానే తండ్రికి చాలా కోపం వచ్చింది. ‘చిన్న పిల్లాడివి నీకెందుకు? అయినా నీకు సంబంధంలేని విషయం ఇది’

‘నాకు తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ చెప్పు నాన్నా!’ కొడుకు ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

తండ్రి మనసులో లెక్కించి చెప్పాడు. ‘నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే… గంటకి రెండొందలు’.

ఒక్క క్షణం ఆ కుర్రాడు ఏదో ఆలోచించి ‘అయితే నాన్నా నాకు ఒక వంద రూపాయలు ఇవ్వవా?’ అన్నాడు.

దానితో తండ్రి తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కొడుకుని ఒక చెంపదెబ్బ కొట్టి ‘నీ గదిలోకి వెళ్ళిపో’ అంటూ గద్దించాడు. కుర్రాడు మౌనంగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు.

చాలాసేపటి వరకు తండ్రికి కోపం తగ్గలేదు. ‘డబ్బులు మాములుగా అడగవచ్చు కదా! ఎంత ధైర్యం నా సంపాదన కనుక్కుని, నీ అరగంట సంపాదనేగా వంద ఇవ్వమని ఎమోషనల్ బ్లాక్మెయిల్  చేస్తాడా?’.

ఓ గంట…

దయ్యం - Dayyam Telugu Moral Story

Image
మున్నావాళ్ళిల్లు ఓ కొండ పై ఉంది. ఆ ఇంటి వెనక చిట్టడవి ఉంది. బయట తిరక్కుండా ఇంట్లోనే ఆడుకోవాలని మున్నా వాళ్ళ అమ్మా నాన్నా చెప్పారు. కానీ మున్నాకి ఆ అడవిలో ఏముందో చుడాలని కోరిక. తను చదివే కథల్లో వున్నట్టు ఆ అడవిలో జంతువులు ఉంటాయి, అవి మాట్లాడతాయి. తనతో స్నేహం చేస్తాయి. అనుకునే వాడు.

ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాడు. అడవిలో దయ్యం వుంది. అది మనుషులని తినేస్తుంది. అని చెప్పింది వాళ్ళ అమ్మ. మున్నాకి భయం వేసింది. ఐనా కుడా అమ్మ వూరికే అలా అంటుంది లెమ్మని అనుకున్నాడు. ఓ రోజు మున్నా ఇంట్లో ఎవరికీ తెలియకుండా అడవిలోకి వెళ్ళాడు. కాస్త దూరం వెళ్ళే సరికి దూరంగా ఏదో నల్లటి ఆకారం అటు ఇటూ కదులుతూ కనిపించింది.

‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో. కాస్త ధైర్యం తెచ్చుకుని దగ్గరకి వెళ్ళి పరీక్షించాడు. గాలికి ఊగే ఒక చెట్టు నీడ అది. ‘హమ్మయ్య ఇది దయ్యం కాదు’ అనుకున్నాడు. కాసేపటికి వెనకగా ఎవరో వస్తున్నట్టు ఎండుటాకుల శబ్దం వినిపించసాగింది. ‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో.

ఓ చెట్టు చాటుకి వెళ్ళి వచ్చేది ఎవరా అని చూడసాగాడు. తీరా ఆ వచ్చింది ‘చోటు’. చోటు వాడి కుక్కపిల్ల. మున్నాని వదిలి ఉండలేదు కదా! అందుకే వెత…

గుడ్డి రాబందు - జిత్తుల మారి పిల్లి

Image
ఒక నది ఒడ్డున ఒక గుడ్డి రాబందు నివసించేది. ఎన్నో ఇతర పక్షులూ అదే చెట్టుపైన జీవించేవి. పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో కొంత రాబందుకు కూడా ఇచ్చేవి. బదులుగా, ఆ పక్షులు గూళ్లలో లేనపుడు వాటి పిల్లలను రాబందు చూసుకునేది.

ఒకరోజు ఒక పిల్లి చెట్టుమీద ఉన్న పక్షి కూనలను గమనించింది. ఎలాగైనా వాటిని ఆరగించాలని అనుకుంది. కాని పిల్లి రావడం గమనించిన పక్షి కూనలు అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విన్న గుడ్డి రాబందు "ఎవరు, ఎవరక్కడా?" అని అరిచింది.

రాబందును చూసిన పిల్లికి ప్రాణం పోయినంత పనయింది. 'నా పనైపోయిందిరా దేవుడా. ఈ రాబందు నన్ను వదలుదురా బాబు! దీన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి' అని అనుకుంటూ, " నేనే...నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను గురువా" అన్నది పిల్లి గట్టిగా. రాబందు ఎవరు నువ్వు? అని అడిగింది. "నేను పిల్లిని" అని జవాబిచ్చింది పిల్లి.

"వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను" అని అరిచింది రాబందు. రాబందు అరుపులకు భయపడ్డ పిల్లి "గురూ్! నా మాట విను తర్వాత నన్ను చంపినా సరే" అని ప్రాధేయపడింది. "మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు?" అని ర…

ముసలి ఎద్దు - Telugu Stories With Moral

Image
ముసలి ఎద్దు
సీతాపతి అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా చాలా ఉత్సాహంగా పొలంపనులు చేసి, బండిలాగి సీతాపతికి ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది.

సీతాపతి ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును తెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి, కుడితిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డివేసి ఉరుకునేవాడు.క్రమంగా అది కూడా దండగ అనుకున్న సీతాపతి ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దుని విప్పి ‘నీకు పని చేసే వయసు అయిపోయింది. శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకో’ అని ముసలి ఎద్దును తరిమేశాడు.

ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు క్రిష్ణ అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. ముసలి ఎద్దు  తన జాలి గాథ వినిపించింది.

క్రిష్ణ ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని సీతాపతి ఇంటికి వెళ్లి ‘ఈ ఎద్దు నీదేకదూ!’ అని అడిగాడు. అవునన్నాడు సీతాపతి. ‘దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యి వరహాలు ఇస్తాను.’ అన్నాడు క్రిష్ణ.

సీతాపతి ఆశ్చర్యపోగా ‘నీకు తెలియదా? ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి…

పిసినారి కనకయ్య - Telugu Stories For Kids With Moral

Image
పిసినారి కనకయ్య 
కనకయ్య వొట్టి లోభి , ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.

"సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు!రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి. కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బం…

నీటికి నిప్పుకు పెళ్ళంట - Kids Stories Telugu

నిప్పూ-నీరు ప్రేమించుకున్నాయి. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాయి. వాటి లక్షణాలే వాటి పెళ్ళికి అడ్డం. నిప్పు తాకితే నీరు ఆవిరవుతుంది. నీరు, నిప్పు మీద పడితే చల్లారిపోతుంది. పెళ్ళి చేసుకోవడం ఎట్లా? బాగా ఆలోచించాయి. వారి చుట్టాలను సంప్రదించాయి.

నీరేమో వారి బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పకపోగా “మనకు వాటికి జన్మజన్మల వైరం ఎట్లా కుదురుతుంది” అని కోప్పడ్డాయి. నిప్పేమో పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పును కోప్పడ్డాయి. వీటి ప్రేమను అర్థం చేసుకోలేదు.

అందరిలాగే పెళ్ళి చేసుకోవాలని పిల్లాజెల్లాతో హాయిగా ఉండాలనుకున్నాయి. కాని ఆశ తీరే దారే కనపడలేదు. చివరకు మేధావి అయిన ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకున్న కార్మికుడిని అడిగాయి. అతను ఆలోచించి, “సరేలే! మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తాను” అన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. రెండు వైపుల చుట్టాలను పిలిచాడు. కాని పెళ్ళికి వచ్చిన చుట్టాలు ఈ పెళ్ళి వద్దని ప్రమాదమని, కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా యాగి చేశాయి. కార్మికుడు వారిని ఒప్పించాడు.

వారిద్దరి పెళ్ళి చేసి వారిని బాయిలర్ అనే క్రొత్త ఇంట్లో కాపురముంచాడు. వారు అన్యోన్యంగా కాపురం చేయడమే కా…

కోతి పాట్లు - Telugu Moral Stories For Kids And Students

Image
అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెదికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనుల్ని అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరివాళ్ల కళ్లు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది.

ఒకరోజు కోతి ‘నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది’ అని తోడేలును అడిగింది. అప్పుడు తోడేలు ‘ఈ రోజు రాత్రికే నిన్ను తీసుకెళ్తాను. రాత్రికి సిద్ధంగా ఉండు’ అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తె…