Posts

Showing posts from September, 2019

దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామలింగడు

Image
దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామలింగడు
శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినయినా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు.
అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకట…

విక్రమార్కుడు ఎవరు - Bethala Kathalu In Telugu

Image
Bethala Kathalu In Telugu Bethala Kathalu in telugu, bethala Kathalu, moral stories in telugu, neethi kathalu, chandamama kathalu, Telugu stories for kids.విక్రమార్కుడు ఎవరు
పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా? ఐతే ఆ విక్రమార్కుడుకి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి?

భూలోకంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది (దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవన్ని మరోసారి). ఐతే ఈ పట్టణం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం ఖూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి.

కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగంచేసి దేశాంతరం వెళ్ళి పోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలు…

మృగరాజు - చిట్టెలుక - Pedarasi Peddamma Kathalu

Image
Pedarasi Peddamma Kathaluమృగరాజు - చిట్టెలుక
ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.

అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది.

కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప…

Pedarasi Peddamma Kathalu - Pedarasi Peddamma Katha

Image
యాపిల్ చెట్టూ - సుబ్బూ మంచి ఫ్రెండ్స్ అట
ఒకరోజు స్కూలు నుంచి ఇంటికెళ్తుంటే.. దార్లో సుబ్బూకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది. అంతే పరుగెత్తుకుంటూ వెళ్లి రెండు యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తరువాత అక్కడే, ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు.

ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పట్నించీ మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆరోజు నుంచీ ప్రతిరోజూ సుబ్బూ ఆ చెట్టు వద్దకు వెళ్లి పండ్లుతిని, ఆడుకుని, నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు.

ఇక యాపిల్ చెట్టు కూడా రోజూ సుబ్బూ కోసం ఎదురుచూసేది. సుబ్బూ పెద్దవాడవుతున్నట్లుగానే, చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవి అయ్యాయి. ఓ రోజు సుబ్బూ నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా.. ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది వాటికోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బూ.

నా దగ్గర కూడా డబ్బు లేదు కానీ.. నా పండ్లను అన్నింటినీ అమ్మి, ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బూ సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు. చాలా కాలందాకా సుబ్బూ ఆ చెట్…

పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం - Paramanandayya Sishyula Katha

Image
పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం
ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్థుడు వున్నాడు. అతనికి పరమానందయ్యగారంటే ఎంతో భక్తి. పరమానందయ్యగారి తండ్రి, తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్యగారిని దైవసమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేద వాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడూ ఆయన పరమానందయ్యగారి వద్దకు వచ్చి తృణమో పణమో యిచ్చి వెళుతూ వుంటాడు.రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్దాలు ఆడి, మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ భార్యా పిల్లలు దక్కలేదు. నా అనే దిక్కులేక, గ్రామస్థులతో, సరిపడక మనసు బాగులేనప్పుడూ, ఏదయినా అనారోగ్యం వచ్చినప్పుడూ పరమానందయ్యగారి వద్దకు వెళ్ళి, రెండురోజులు ఉండి పోతుండేవాడు.

ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు కడుపునొప్పి పట్టుకొంది. ఎన్నాళ్ళకూ తగ్గలేదు. మంచం పట్టాడు. తన స్థితి పరమానందయ్యగారికి ఉత్తరం ద్వారా తెలియచేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు. రామయ్య ఉత్తరం చదువుకొని పరమానందయ్యగారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు. గురువుగారిని చూచి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగ…

మీ ఓర్పే గెలిపిస్తుంది - Abraham Lincoln Inspirational Stories In Telugu

Image
Abraham Lincoln Inspirational Stories In Telugu
అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది.

ఆయన అమెరికా అధ్యక్షుడయిన కొత్తల్లో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు.

అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసినవారు వస్తే చూసి ఓర్వలేరు. వీలయినప్పుడల్లా వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటారు.

అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి కాలికున్న బూటుతీసి ఎత్తిపట్టుకుని ........

‘‘లింకన్! నువ్వు చాలా గొప్పవాడిననుకుంటున్నావ్, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావ్.
మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లుకుట్టాడు.
ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే.
నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలామంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు.
నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి.
అది గుర్తుపెట్టుకో.
అదృష్టం కలిసొచ్చి ఆధ్యక్షుడివయ్యావ్.
ఈ వేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావ్’’ అన్నాడు.

 లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడయిపోయాడు.
నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో …

తలతిక్క రాజు కథ-1 -

Image
తలతిక్క రాజు కథ-1
అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం, మంచివాళ్ళే- కానీ రాజుకీ, మంత్రికీ మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టంలేదు. అందుకని, ఏదైనా ప్రత్యేకత ఉండాలని, వాళ్ళొక శాసనం చేసారు- పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు: "రాజ్యంలో ప్రతివాళ్ళూ చీకట్లో పని చెయ్యాలి; తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో, వాళ్లకు మరణ దండన!"ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలౌతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు.

ఒకరోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు, మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది; నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదుగదా, ఒక్క ఎలుకకూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయె! రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు! గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది.

అయితే సాయంత్రం అయ్యేసరికి, నగరమంతా ఒక్కసారి…

బంగారు ఊయల - Neethi Kathalu in Telugu

Image
Neethi Kathalu in Telugu Moral Stories In Telugu
బంగారు ఊయల
అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనికి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయ పడేది. మందరమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. మిఠాయి అంతా తనే తినాలి. గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం! సువర్ణ ఎంత పని చేసినా, మందరమ్మ తిడుతూ, కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు.

ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి "బంగారు బొమ్మలా ఉందమ్మా" అని మెచ్చుకుంటుంటే, మందరమ్మ, చూసి పళ్ళునూరేది! మందరమ్మ అసూయ, కోపంతో, సువర్ణని ఎండలో పనిచేయించేది! అలా ఎండలో పనిచేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని. మందరమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి, పశువుల పాకలో కూర్చుంది. సువర్ణని చూసి చీమలు జట్టుగా వంట ఇంటిలోనికి వెళ్ళాయి. రొట్టె ముక…

మంచి మిత్రుడు (పావురం - ఎలుక) - Neethi Kathalu

Image
మంచి మిత్రుడు (పావురం - ఎలుక)
పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది.

'అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూసాను. ఈ రోజు నాకు ఏ ఆపద రానున్నదో...' అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు.

ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు 'చిత్రగ్రీవుడు' అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో 'మిత…

పొడుపు కథలు - Podupu Kathalu In Telugu

Image
Podupu Kathalu In Telugu Part 3  Telugu podupu kathalu, podupu kathalu in telugu with answers. 


పొడుపు కథలు - 3: * ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.
జ. తేనెపట్టు

* ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
జ. అరిటాకు

* ఆలుకాని ఆలు.
జ. వెలయాలు

* అందంకాని అందం
జ. పరమానందం, బ్రహ్మానందం

* ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
జ. చీమలదండు

* ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న
జ. వెలగపండు

* ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.
జ. చింతకాయలు

* ఆ ఆటకత్తె ఎప్పుడూలోనే నాట్యం చేస్తుంది
జ. నాలుక

* ఆకాశాన పటం.. కింద తోక.
జ. గాలిపటం

* ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.
జ. విమానం

* ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే
జ. ఉల్లిపాయ

* గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి.
జ. బూరె

* అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది.
జ. కవ్వం

* దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది.
జ. దీపం

* జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.
జ. నీడ

* నామముంద…

పొడుపు కథలు

Image
Podupu Kathalu In Telugu With Answers Here are the part 2  of telugu podupu kathalu in telugu with answers. 


పొడుపు కథలు - 2: * దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల

* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం

* పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి

* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి

* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి

* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.

* పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ

* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు

* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.

* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు

* ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం

* ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు

* ఇల్లుకాని ఇల్లు
జ. బొమ్మరిల్లు

* ఇంటికి అందం
జ. గడప

* ఇంటింటికీ ఒక నల్లోడు
జ. మసిగుడ్డు

* ఇంటికి అంత ముండ కావాలి
జ. భీగము

* ఇల్లంతాఎలుక బొక్కలు..
జ. జల్లెడ

* ఇల్లంత…

పొడుపు కథలు

Image
పొడుపు కథలు - 1 : 1. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం

2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు

3. ఎందరు ఎక్కిన విరగని మంచం.
జ. అరుగు.

4. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
జ.దీపం వెలుగు.

5. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జ. పొగ

6. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జ. మేఘం

7. తలపుల సందున మెరుపుల గిన్నె.
జ. దీపం

8. తల్లి దయ్యం, పిల్ల పగడం.
జ. రేగుపండు

9. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
జ. కొవ్వొత్తి

10. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
జ. వేరుశనగ

11. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ

12. నల్లకుక్కకు నాలుగు చెవులు
జ. లవంగం

13. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
జ. అత్తి చెట్టు

14. తొడిమ లేని పండు, ఆకులేని పంట.
జ. విభూది పండు, ఉప్పు

15. తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి

16. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం

17. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ

18. తల నుండి పొగ చిమ్ముంద…

తెలుగు సామెతలు - Telugu Samethalu

Image
Telugu Samethalu Read all telugu samethalu, samethalu in telugu. 


తెలుగు సామెతలు
* తంగేటి జుంటిని దాప ఎందుకు? (దాచుటెందుకు?)(జున్ను= తేనెతుట్టె).

* తంగేడు పూచినట్లు.

* తంటాలమారి గుఱ్ఱానికి తాటిపట్ట గోఱపము (గోఱపము=కోకుడు దువ్వెన).

* తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది.

* తండ్రికదా అని తలాటి కీడ్చినట్లు.

* తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది, తల్లి చస్తే కాపురం తెలుస్తుంది.

* తండ్రి తవ్విన నుయ్యి అని దానిలో దూకవచ్చునా?

* తండ్రిని చంపబోయిన పాపం, అత్తవారింటికి పోయి, అంబటికట్ట తెగేవఱకు ఉంటే పోవును.

* తండ్రి వంకవారు దాయాది వర్గమే.

* తండ్రి సేద్యం కొడుకు వైద్యం కూడు మధ్యం.

* తంతే దూదిపరుపు మీద పడ్డట్లు.

* తంతే బూర్ల (గారెల) గంపలో పడ్డట్లు.

* తంబళి అనుమానం తలతిక్కతో సరి.

* తంబళి తన లొటలొటె గానీ, ఎదుటి లొటలొట ఎరుగడు.

* తంబళ్ళ అక్కయ్య మొదుమూడి వెళ్ళను వెళ్ళాడు, రానూ వచ్చాడు.

* తక్కువజాతికి (వానికి) ఎక్కువకూడైతే తిక్క తెగులు.

* తక్కువనోములు నోచి, ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా?

* తక్కువవాడికి నిక్కెక్కువ, తవ్వెడు బియ్యానికి పొంగెక్కువ.

* తక్కువ వానికి నిక్కులు లావు.

* తగపండిన పండు తనంత తానే పడుతుంది…