Posts

Showing posts from October, 2019

Telugu Short Stories With Moral | Short Stories In Telugu For Kids

Image
Telugu Short Stories With Moral  Short Stories In Telugu For Kids
Telugu short stories, telugu short stories with moral, telugu moral stories pdf, moral stories in telugu, telugu short films love, telugu moral stories on friendship, short stories in telugu, Telugu neethi kathalu. పేదవాడైన రాజుగారి అన్న
పృధ్వీపాలుడు ఔదార్యంగల రాజు ఆయన కొలువు లోకి పండితులు ఎప్పుడు స్వేచ్చగా ప్రవేశించే వీలు ఉండేది. ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృధ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు. "నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను రాజు గారి అన్నని" అని చెప్పాడతడు. "ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు. మా రాజు గరికి అన్నలుగాని, తమ్ముళ్ళుగాని లేరు" అన్నారు ద్వారపాలకులు. "నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజు దగ్గరకి వెళ్ళి మీ అన్న కలవటానికి వచ్చాడు అని చెప్పండి" అని చెప్పాడు ఆవ్యక్తి. ద్వారపాలకులు చెప్పింది వినగానే పృధ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. "అవునా...వెంటనే అతన్ని నాముందుకు తీసుకురండి" అని ఆదేశించాడు. ఆ వ్యక్తిని చూడగా…

Pedarasi Peddamma Kathalu In Telugu

Image
Pedarasi Peddamma Kathalu In Telugu  పులి - పేరాశ బ్రాహ్మణుడు
ఒక ముసలి పులి స్నానం చేసి ఒక చేతిలో దర్భలు, మరో చేతిలో బంగారు కంకణం చేతిలో పట్టుకుని ఏటి గట్టుపైన కూర్చుంది. అదే సమయంలో ఏట్లో స్నానం చేసేందుకు వచ్చిన బ్రాహ్మణుడు ఆవలి గట్టుమీద ఉన్న పులిని చూసి భయంతో పారిపోబోయాడు.

ఇది చూసిన పులి "ఓయీ బ్రాహ్మణుడా...! నన్ను చూసి భయపడవద్దు. నేను నిన్నేమీ చేయను" అంది. దీంతో కాస్తంత బెరుకుగానే ఆగిపోయాడు బ్రాహ్మణుడు. ఇంకా అతడికి భయం పోలేదని గ్రహించిన పులి... "ఇదిగో ఈ బంగారు కంకణం తీసుకుని నీ దరిద్రాన్ని పోగొట్టుకో..!" అంటూ నమ్మబలికింది.

బంగారం అనగానే, అసలే పేరాశ కలిగిన ఆ బ్రాహ్మణుడికి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఈ పులి క్రూరజంతువు కదా... దీన్నెలా నమ్మేది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. అది చూసిన పులి.. "నేను బాగా వయసులో ఉన్నప్పుడు మనుషులను చంపి తిని బోలెడంత పాపం మూటగట్టుకున్నాను. ఇకమీదటైనా అలాంటి పనులు మానుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పింది.

అయినా కూడా బ్రాహ్మణుడు తన దగ్గరకు రాకపోవడంతో... "నేను పాపపు పనులు చేసేటప్పుడు ఒక పుణ్యాత్ముడు నామీద దయతలచి ఇకపై ఎప్పుడూ పశు…

పెద్దపులితో ఆడుకునే సూరయ్య

Image
పెద్దపులితో ఆడుకునే సూరయ్య
పేదవాడైన తిమ్మయ్య కామందు దగ్గర అప్పుచేసి, జీవితమంతా ఆ అప్పు తీరకపోవడంతో మంచపట్టాడు. మనోవ్యాధి ఎక్కువైన తిమ్మయ్య కొడుకు సూరయ్యను కామందు దగ్గర పనికి అప్పగించి కన్నుమూస్తాడు. ఎలాంటి జాలీ, దయా, కరుణా లేని కామందు చిన్నవాడైన సూరయ్యను చిత్రహింసలు పెడుతుంటాడు.
ప్రతిరోజూ చాకిరి చేస్తున్నప్పటికీ, కడుపునిండా తిండి పెట్టకపోవడమే గాకుండా... పసివాడని చూడకుండా సూరయ్యను రాచిరంపాన పెడుతుంటాడు కామందు. కామందు హింసను తట్టుకోలేని సూరయ్య చెప్పా పెట్టకుండా ఊరు వదలి పారిపోతాడు. ఎన్నో చిత్రహింసలను అనుభవించిన సూరయ్యకు మనుషులంటే తీవ్రమైన అసహ్యం ఏర్పడింది.
కామందు ఇంటినుంచి బయటపడ్డ సూరయ్య ఎటుబడితే అటు కొండలు, కోనలూ దాటుకుంటూ ఓ పెద్ద కారడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక జలపాతం కింద కొండ గుహ కనిపిస్తే అక్కడే ఆగిపోయి ఉండసాగాడు. అడవిలో దొరికే పండ్లూ, ఫలాలలను తింటూ జీవనం సాగించాడు.
అలా ఏడు సంవత్సరాలు గడిచాయి. గడ్డమూ, మీసాలూ పెరిగాయి. మౌనంలో మాటలే మరిచిపోయాడు సూరయ్య. పులులు, తోడేళ్ళు లాంటి క్రూరమృగాలు సైతం అతడితో సఖ్యంగా ఉండసాగాయి.
ఇలా ఉంటే... ఒకసారి శివయ్య అనే అతను ఆ దారిలో తన స్నేహితులతో కలిసి …

పిసినారి పాట్లు

Image
Pedarasi Peddamma Kathalu Pedarasi peddamma kathalu in telugu language, moral stories in telugu for kids, pillala kathalu neethi kathalu, Telugu short stories for kids, chandamama kathalu, pedarasi peddamma stories for kids, kathalu, moral stories in telugu for students. 
పిసినారి పాట్లు
పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం బంగ. బంగలో నివసించే ప్రతి ఒక్కరికీ తెలుసు- మంగళ్దాస్ ఎంత పిసినిగొట్టో. ఒకసారి మంగళ్దాసు దుకాణంనుండి ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య పుచ్చకాయ (కలింగరి కాయ)ముక్కలు తరిగి పెట్టింది. అయితే ఇంట్లో చూస్తే, దాని పై చెక్కు కనబడలేదు మంగళ్దాసుకు. దాంతో అతను ఎంత రగడ చేశాడంటే, చివరికి అతని భార్య విసిగిపోయి, తను బయట చెత్తకుప్పలో పారేసిన పుచ్చకాయ చెక్కుల్ని ఏరుకొచ్చి, వాటిని కడిగి, కూర చేసి పెట్టింది!
ఒకసారి ఆ మంగళ్దాసు పనిమీద నగరానికి వెళ్లాల్సి వచ్చింది. బస్సు ఛార్జీలు మిగుల్చుకునేందుకుగాను అతను నగరం వరకూ నడిచి పోయాడు. మధ్యలో నదిని దాటేందుకు, మరబోటులో అయితే ఎక్కువ అడుగుతారని, తాతల కాలంనాటి పాత డింగీనొకదాన్ని ఎక్కాడు.
వెళ్లటం బాగానే వెళ్ళాడు గాని, వెనక్కి వచ్చేటప్పుడు, కాలం చెల్లిన…

పెద్దపులి - బాటసారి

Image
పెద్దపులి - బాటసారి
రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి.
ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైన…

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

Image
మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు
ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.

తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్ళు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్ళు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్ళు పెట్టేదెలా?తోటకి ఎట్లా నీళ్ళు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్ళు పెట్టాలంటే బోలెడు నీళ్ళు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా అలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది.

ఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళవంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ…

ఉంగరం దొంగ ఎవరు? | Moral Stories In Telugu For Kids And Students

Image
ఉంగరం దొంగ ఎవరు
ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.ఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. "బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు." అన్నాడు రాజు గారు "ఏమైనది మహారాజా!" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపా…

తెనాలిరామలింగడు నారింజపండ్లు

Image
శ్రీకృష్ణ దేవరాయులుకు ఒకసారి చైనా చక్రవర్తి కొన్ని నారింజపండ్లను కానుకగా పంపించాడు. పండ్లను తమ సేవకులతో పంపిస్తూ, ఇవి చాలా ప్రత్యేకమైన నారింజపండ్లనీ, వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులు అవుతారని రాసిన చిన్న లేఖను కూడా పెట్టి పంపుతాడు చైనా చక్రవర్తి.

వాటిని ఎంతో భక్తితో తీసుకువచ్చిన రాజ ప్రతినిధి శ్రీకృష్ణ దేవరాయులు ఆస్థానానికి విచ్చేసి, ప్రభువుకు సగర్వంగా అందజేస్తాడు. పండ్ల బుట్టలో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ నారింజ పండ్లను చూసే సరికి దేవరాయులతో పాటు, సభలోని సభికులందరూ ఎంతో కుతూహలంతో చూడసాగారు.

అందరూ అలా చూస్తుండగానే... సభలో ఉన్న తెనాలిరామలింగడు ఒక్క ఉదుటున లేచి, టక్కున ఒక పండు తీసుకుని, ఒలిచి నోట్లో వేసుకుని..."అబ్బా...! చాలా బాగుంది. అద్భుతమైన రుచి" అంటూ పొగడసాగాడు. దీంతో సభికులందరూ హతాశులై చూస్తుండగా... రాయలవారికైతే రామలింగడిపైన పట్టరాని కోపం వచ్చింది.

వెంటనే తమాయించుకుని... "చైనా చక్రవర్తి నాకోసం పంపించిన పండ్లు అవి. నా అనుమతి లేకుండా తీసుకున్నావు. కాబట్టి నీకు మరణదండన తప్పదు" అని హెచ్చరించాడు. చక్రవర్తి మాటలను విన్న రామలింగడు మరణదండన గురించి బాధపడకుండా... పకపకా న…

ఇద్దరు వేటగాళ్లు

Image
వసంత ఋతువులో ఒకనాడు సంతోషమూ, దు:ఖమూ ఒక చెరువు ఒడ్డున కూర్చుని ఉన్నాయి. నిశ్శబ్ద ప్రశాంతతలీనే నీళ్లకు దగ్గరగా చేరగిలపడి, అవి మాట్లాడుకుంటున్నాయి.

ఈ భూమి మీద ఉన్న అందం గురించీ; అడవిలోనూ, కొండల్లోనూ ఉన్న అద్భుత జీవ సంపద గురించీ; ఉదయ సంధ్యలోను, సాయం సమయంలోనూ వినిపించే పాటల గురించీ మాట్లాడింది సంతోషం.

అప్పుడు దు:ఖం మాట్లాడుతూ సంతోషం చెప్పిన వాటిని అన్నింటినీ అంగీకరించింది- ఎందుకంటే కాలపు మహిమా, అందులోని అందమూ దు:ఖానికీ తెలుసు. ఇక పొలాల్లోనూ కొండల్లోనూ ఉన్న వసంతాన్ని గురించి చాలా గొప్పగా వర్ణించింది దు:ఖం.

అలా సంతోషమూ, దు:ఖమూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాయి. అవి మాట్లాడుకున్న ప్రతి అంశంపైనా రెండూ సంపూర్ణంగా ఏకీభవించాయి.

అదే సమయానికి చెరువుకు అవతలి ఒడ్డున ఇద్దరు వేటగాళ్లు పోతూ వాటిని గమనించారు. వాళ్లు అటుకేసి చూస్తుండగా ఒక వేటగాడన్నాడు- "ఎవరయి ఉంటారు, వీళ్లిద్దరూ?" అని.

"ఇద్దరంటున్నావా!? నాకైతే ఒక్కరే కనబడుతున్నారు" అన్నాడు రెండవ వాడు.

"కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు" అన్నాడు మొదటివాడు.

"నాకైతే ఒక్కరే కనబడుతున్నారక్కడ. చెరువులో కనబడుతున్న ప్రతిబింబం కూడా ఒక్కట…