Posts

Showing posts from December, 2019

కోతి - యువకుడు

Image
Neethi Kathalu Telugu

కోతి - యువకుడు ఒక బిచ్చగాడు దొరికినదేదో తిని, ఏ అరుగు మీదనో నిద్రపోయేవాడు. ఖరీదైన కోరికలు లేనందున వాడికి సుఖాల మీదికి మనసు పోలేదు. ఒకసారి వాడికి, ఓ గొప్పదాత ఐదు దీనారాలు బహుమతిగా ఇవ్వగా దాంతో ఒక కోతిని కొన్నాడు. అది ఆడిస్తూ బతికితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని బిచ్చగాడి ఊహ.

ఓ రాత్రి వేళ కోతి ఒక యువకుడిగా మారిపోయింది. అతడు బిచ్చగాణ్ణి పేరుపెట్టి పిలిచి, ఒక బంగారు నాణెం ఇచ్చి ఇద్దరికీ భోజనం తెమ్మన్నాడు. నువ్వు ఏ శాపం వల్ల ఇలా అయ్యావని అడగబోయాడు బిచ్చగాడు. అదంతా అనవసరం వెళ్ళి చెప్పింది చెయ్యమన్నాడు. ఆకలిగా ఉన్న బిచ్చగాడు ఇక ఏమీ మాట్లాడలేదు. ఆ యువకుడే, ఓ డబ్బుసంచి సృష్టించి నగరం మధ్యలో ఒక గొప్ప మేడ కిరాయికి కుదిర్చేలా చూశాడు. ఇప్పుడు భాగ్యవంతుడి దర్పాన్ని, ఠీవిని బిచ్చగాడికి నేర్పాడు. రాజకుమార్తెతో నీకు పెళ్ళి చేయిస్తాను అనగానే నమ్మలేక విచిత్రంగా చూశాడు బిచ్చగాడు. అప్పటికే అతనికి యువకుడి మీద చాలా కృతజ్ఞతగా ఉంది. యువకుడు ఏం చెప్తే అది మారు మాట్లాడకుండా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాడు.

అతడి సలహా మేరకు ఆ దేశపు రాజుగార్ని కలిసి, వజ్రాలను బహుకరించి, కూతుర్ని ఇమ్మన్నాడు. రాజు …

శీనుగాడి పగటి కలలు

Moral Stories In Telugu For Kids Moral Stories In Telugu, Neethi Kathalu, Telugu stories for kids, Telugu moral Stories, Telugu short stories for kids, telugu stories with moral.
శీనుగాడి పగటి కలలు ఒక ఊర్లో శీనయ్య అనే వంటవాడు ఉండేవాడు. పక్క ఊర్లో ఏదో శుభకార్యం కోసం వంటపని ఒప్పుకున్నాడు. దాంతో శుభకార్యం రోజున ఆ ఊరికి వెళ్లి వంట చేశాడు. అతడు బాగా వంటచేయటంతో మెచ్చుకున్న ఆ ఇంటివారు.. శీనయ్యకు ఇవ్వాల్సిన డబ్బుతోపాటు ఓ అరమూట వడ్ల గింజలను కూడా బహుమతిగా ఇచ్చారు. వాటిని భుజంపై వేసుకుని ఇంటికి బయలుదేరాడు శీనయ్య.

నడచి, నడచి బాగా అలసిపోవటంతో.. విశ్రాంతి తీసుకునేందుకు ఓ కుమ్మరి ఇంటివద్ద ఆగుతాడు శీనయ్య. బాగా నీరసంగా ఉంది, కాసేపు మీ ఇంటి అరుగుమీద కునుకుతీసి వెళ్తానని ఆ ఇంటివారిని అడిగాడు. వాళ్లు ఒప్పుకోవటంతో అరుగుమీద పడుకున్నాడు. ఎంతసేపటికీ నిద్ర రాకపోవటంతో ఏవేవో ఆలోచనల్లో పడిపోయాడు శీనయ్య.

ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఇలా అనుకోసాగాడు.. "తన వద్దనుండే ధాన్యం మూటలోని గింజల్ని విత్తనాలుగా పెరట్లో వేస్తే.. అవి కొన్నాళ్లకు పెరిగి పెద్దవై పంట చేతికి వస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాలలో నాటితే ఇంకా ఎక్క…

కోతి బావ - టక్కరి నక్క

కోతి బావ - టక్కరి నక్క
అనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తుండేది. ఒక రోజున నది ఒడ్డుపైనుండే చెట్లలో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి, స్పృహ తప్పి పడి ఉన్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్లు తెలీనంత మైకంలో పడివున్న నక్కను చూడగానే కోతికి జాలివేసి దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది.


తనకు తెలిసిన చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తినిపించింది కోతి. కాసేపటి తరువాత నక్కకు స్పృహ వచ్చింది. "ఏమయ్యింది... ఎందుకు అక్కడ పడుకున్నావు..?" అని ఆరా తీసింది.

అప్పుడు నక్క "నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తోంది. దాహంగా ఉండటంతో నది వద్దకు వచ్చి, నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది. నిన్న కురిసిన వర్షానికి అది పూర్తిగా పడిపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే...!" అంటూ నిట్టూర్చింది.

కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి “ఎవరూ లేరని బాధ పడకు. మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్క నున్న ఇల్లు కూడా నాదే ఇదివరలో దాంట్లో ఒక జింక అద్దెకి ఉండేది. ఇప్పుడా ఇల్లు ఖాళీగా ఉంది, నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు. అద్దె ఏమీ ఇవ్వక్కర్లేదులే...!” అని చె…

తెలివైన చిలుక | Telugu Moral Stories To Read

Image
Moral Stories In Telugu , Telugu Moral Stories
తెలివైన చిలుక
వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి.అప్పుడు మూడవ నిజంచెబుతాను. అదికూడా నచ్చితే నాకు స్వేచ్చను ప్రసాదించాలి. సరేనా! అని, వ్యాపారిని అడిగినది. దీనికి వ్యాపారి వప్పుకొన్నాడు. చిలక మొదటినిజం ఇలాచెప్పినది. ఏది పోగొట్టుకొన్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు. వ్యాపారికి ఈ సలహా నచ్చినది. చిలుకను డాబా మీదుకు వెళ్ళమన్నాడు. రెండవ సలహాగా చిలుక ఇట్లు చెప్పినది. ఏదయినా సరే నీకళ్ళతో నీవు చూచేదాకా నీవు నమ్మ…

మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు

మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు
ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.

తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్ళు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్ళు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్ళు పెట్టేదెలా?

తోటకి ఎట్లా నీళ్ళు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్ళు పెట్టాలంటే బోలెడు నీళ్ళు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా అలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది.

ఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళవంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ…

గాండ్రించిన కప్ప

గాండ్రించిన కప్ప
పుట్టలు, గుట్టలు దాటుకొంటూ సింహం హడిలి పోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గాబరాను గమనించిన నక్క, గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. సింహం, ఆయాసంతో వొణుకుతూ చెప్పింది.

"మామూలుగా కొలనులో మంచి నీళ్ళు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్, గుర్...పువ్వాం పువ్వాం... బెకా బెకా మంటూ హొరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది, అటూ ఇటూ చూశాను...ఎవ్వరూ కనపడలేదు సరిగదా! ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగి పోతున్నాయి. ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి వుంటుంది!నన్ను చంపడానికి ఏ దెయ్యమో వచ్చి, అరుస్తుందని నాకు భయం వేసింది. పరుగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను. కౄరమృగమో, దెయ్యమో దానిని చంపివేస్తేనే గాని నాకు స్తిమితం కలగదు" అంటూ ముందు కాళ్ళపై తల పెట్టుకొని ఆలోచించడం మొదలు పెట్టింది సింహం...! నక్కకు విషయం అంతా అర్ధమైయింది. ఆ అరుపులు, ఇది వరకు ఎన్నోసార్లు విన్నది నక్క! అందుచేత దానికి భయం కల్గలేదు. ఏమీ భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరకు తీసుకు వచ్చింది. బిగ్గరగా అరవమంది, ఆ అరుపులు, విని శత్రుమృగం బైటకు వస్తే చంపివేయవచ్చని ధైర్యం చె…

తెలివి తక్కువ రాజు

Image
తెలివి తక్కువ రాజు
ఒక అరణ్యంలో రకకాల పక్షులు, జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడంటూ ఉంటే బావుంటుందని భావించిన జంతువులు ఒక రోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి జంతువులన్ని కడుపుబ్బ నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి.

ఇదంతా నక్కకు నచ్చలేదు "రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్దిలో, బలంలో అందరినీ మించిన వాడై ఉండాలి. అంతే కాని ఒక కోతి రాజుగా ఉండతగినది కాదు" అని అనుకుంది.

ఒక రోజు ఆ నక్క ఆహరం కోసం సంచరిస్తుండగా ఒక చోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనబడ్డాయి, ఆ జిత్తులమారి నక్క చాలా ఆకలిగా ఉన్నా ఆహారం జోలికి వెళ్ళకుండా గబగబా కోతి రాజు దగ్గరికి పరిగెత్తింది.

"రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికేచోటు చూపిస్తాను" అని చెప్పింది నక్క.

కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని ఆ ఉచ్చు దగ్గరక…

ఆత్రపడ్డ నక్క - Telugu Neethi Kathalu | Telugu Moral Stories

Image
Telugu Neethi Kathalu, Telugu Moral Stories Hello Guys welcome to " Moral Stories Telugu". Today we are going to read One interesting Telugu moral Story.  If you like the story plz share with your friends. For more stories like Telugu Neethi Kathalu, moral Stories Telugu, short stories for kids..etc follow " Telugu Moral Stories"  blog.


ఆత్రపడ్డ నక్క
ఓ అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా కలసి మెలసి తిరిగేవి. మోసానికి, జిత్తులకు, ఆశకు నక్కలు పెట్టింది పేరు. ఆ నక్కలు కలసి మెలసి తిరుగుతున్నాయి గాని, హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి జుగుప్స. ఒక రోజు అవి రెండూ కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయలుదేరాయి. అవి చెట్లూ, పుట్టలూ, గుట్టలూ, అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి. కాని, తినడానికి ఏ జంతు మాంసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకు చేరి విచారంతో పడుకున్నాయి. వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్లు మూసుకుని కునుకు తీశాయి. ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఆ శబ్ధం వినిపించింది. ఏమిటో అనుకొని, తన పక్కనే ఉన్న నక్క వైపు చూచింది. ఆ నక్క బాగా నిద్రపోతోందని గ్రహించి గబుక్కిన లేచి ఆ చెట్టు కిందపడ్డ ద…

తెనాలి రామలింగడు తేలు కుట్టిన దొంగ | Tenali Ramalingadu Stories In Telugu

Image
Tenali Ramalingadu Stories In Telugu Hello Friends Welcome to Moral Stories In Telugu. Today we are going to read on of the best story of Tenali Ramalingadu also known as Tenali Rama Krishna.


తెనాలి రామలింగడు తేలు కుట్టిన దొంగ
ఆ రోజుల్లో తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.

ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...

"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు" అని అన్నాడు. దీనికి ఆమె "ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను" అంది.

"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొ…

తెనాలి రామలింగడు సంచిలో ఏనుగు

Image
Tenali Rama Krishna Kathalu | Tenali Ramalingadu Stories In Teluguతెనాలి రామలింగడు సంచిలో ఏనుగు ఒకానొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయలవారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురుచూస్తున్న రాజు, ఆయనను పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు. దానికి రామలింగడు "మహారాజా...! మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైంద"ని చెప్పాడు.అంతే ఫక్కున నవ్విన రాయలవారు... "రామలింగా...! ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావుగానీ, చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా.. చెప్పు..?" అన్నాడు. "లేదు మహారాజా..! చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత తేలికైన పనేమీ కాదు. అంతకంటే, కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి" అన్నాడు రామలింగడు.

అయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోడం లేదని అన్నాడు రాయలవారు. నిజం "మహాప్రభూ...! చిన్నపిల్లలు అది కావాలి, ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొట్టినా, తిట్టినా శోకాలు పెడతారు. వీటన్నింటినీ వేగడం, వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండీ..!!" అని వివరించి చెప్ప…

దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామలింగడు

Image
దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామలింగడు శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినయినా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు.


అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి…