Posts

Showing posts from August, 2020

దయ్యం - Dayyam Telugu Moral Story

Image
మున్నావాళ్ళిల్లు ఓ కొండ పై ఉంది. ఆ ఇంటి వెనక చిట్టడవి ఉంది. బయట తిరక్కుండా ఇంట్లోనే ఆడుకోవాలని మున్నా వాళ్ళ అమ్మా నాన్నా చెప్పారు. కానీ మున్నాకి ఆ అడవిలో ఏముందో చుడాలని కోరిక. తను చదివే కథల్లో వున్నట్టు ఆ అడవిలో జంతువులు ఉంటాయి, అవి మాట్లాడతాయి. తనతో స్నేహం చేస్తాయి. అనుకునే వాడు.

ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాడు. అడవిలో దయ్యం వుంది. అది మనుషులని తినేస్తుంది. అని చెప్పింది వాళ్ళ అమ్మ. మున్నాకి భయం వేసింది. ఐనా కుడా అమ్మ వూరికే అలా అంటుంది లెమ్మని అనుకున్నాడు. ఓ రోజు మున్నా ఇంట్లో ఎవరికీ తెలియకుండా అడవిలోకి వెళ్ళాడు. కాస్త దూరం వెళ్ళే సరికి దూరంగా ఏదో నల్లటి ఆకారం అటు ఇటూ కదులుతూ కనిపించింది.

‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో. కాస్త ధైర్యం తెచ్చుకుని దగ్గరకి వెళ్ళి పరీక్షించాడు. గాలికి ఊగే ఒక చెట్టు నీడ అది. ‘హమ్మయ్య ఇది దయ్యం కాదు’ అనుకున్నాడు. కాసేపటికి వెనకగా ఎవరో వస్తున్నట్టు ఎండుటాకుల శబ్దం వినిపించసాగింది. ‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో.

ఓ చెట్టు చాటుకి వెళ్ళి వచ్చేది ఎవరా అని చూడసాగాడు. తీరా ఆ వచ్చింది ‘చోటు’. చోటు వాడి కుక్కపిల్ల. మున్నాని వదిలి ఉండలేదు కదా! అందుకే వెత…

గుడ్డి రాబందు - జిత్తుల మారి పిల్లి

Image
ఒక నది ఒడ్డున ఒక గుడ్డి రాబందు నివసించేది. ఎన్నో ఇతర పక్షులూ అదే చెట్టుపైన జీవించేవి. పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో కొంత రాబందుకు కూడా ఇచ్చేవి. బదులుగా, ఆ పక్షులు గూళ్లలో లేనపుడు వాటి పిల్లలను రాబందు చూసుకునేది.

ఒకరోజు ఒక పిల్లి చెట్టుమీద ఉన్న పక్షి కూనలను గమనించింది. ఎలాగైనా వాటిని ఆరగించాలని అనుకుంది. కాని పిల్లి రావడం గమనించిన పక్షి కూనలు అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విన్న గుడ్డి రాబందు "ఎవరు, ఎవరక్కడా?" అని అరిచింది.

రాబందును చూసిన పిల్లికి ప్రాణం పోయినంత పనయింది. 'నా పనైపోయిందిరా దేవుడా. ఈ రాబందు నన్ను వదలుదురా బాబు! దీన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి' అని అనుకుంటూ, " నేనే...నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను గురువా" అన్నది పిల్లి గట్టిగా. రాబందు ఎవరు నువ్వు? అని అడిగింది. "నేను పిల్లిని" అని జవాబిచ్చింది పిల్లి.

"వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను" అని అరిచింది రాబందు. రాబందు అరుపులకు భయపడ్డ పిల్లి "గురూ్! నా మాట విను తర్వాత నన్ను చంపినా సరే" అని ప్రాధేయపడింది. "మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు?" అని ర…

ముసలి ఎద్దు - Telugu Stories With Moral

Image
ముసలి ఎద్దు
సీతాపతి అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా చాలా ఉత్సాహంగా పొలంపనులు చేసి, బండిలాగి సీతాపతికి ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది.

సీతాపతి ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును తెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి, కుడితిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డివేసి ఉరుకునేవాడు.క్రమంగా అది కూడా దండగ అనుకున్న సీతాపతి ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దుని విప్పి ‘నీకు పని చేసే వయసు అయిపోయింది. శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకో’ అని ముసలి ఎద్దును తరిమేశాడు.

ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు క్రిష్ణ అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. ముసలి ఎద్దు  తన జాలి గాథ వినిపించింది.

క్రిష్ణ ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని సీతాపతి ఇంటికి వెళ్లి ‘ఈ ఎద్దు నీదేకదూ!’ అని అడిగాడు. అవునన్నాడు సీతాపతి. ‘దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యి వరహాలు ఇస్తాను.’ అన్నాడు క్రిష్ణ.

సీతాపతి ఆశ్చర్యపోగా ‘నీకు తెలియదా? ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి…

పిసినారి కనకయ్య - Telugu Stories For Kids With Moral

Image
పిసినారి కనకయ్య 
కనకయ్య వొట్టి లోభి , ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.

"సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు!రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి. కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బం…

నీటికి నిప్పుకు పెళ్ళంట - Kids Stories Telugu

నిప్పూ-నీరు ప్రేమించుకున్నాయి. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాయి. వాటి లక్షణాలే వాటి పెళ్ళికి అడ్డం. నిప్పు తాకితే నీరు ఆవిరవుతుంది. నీరు, నిప్పు మీద పడితే చల్లారిపోతుంది. పెళ్ళి చేసుకోవడం ఎట్లా? బాగా ఆలోచించాయి. వారి చుట్టాలను సంప్రదించాయి.

నీరేమో వారి బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పకపోగా “మనకు వాటికి జన్మజన్మల వైరం ఎట్లా కుదురుతుంది” అని కోప్పడ్డాయి. నిప్పేమో పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పును కోప్పడ్డాయి. వీటి ప్రేమను అర్థం చేసుకోలేదు.

అందరిలాగే పెళ్ళి చేసుకోవాలని పిల్లాజెల్లాతో హాయిగా ఉండాలనుకున్నాయి. కాని ఆశ తీరే దారే కనపడలేదు. చివరకు మేధావి అయిన ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకున్న కార్మికుడిని అడిగాయి. అతను ఆలోచించి, “సరేలే! మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తాను” అన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. రెండు వైపుల చుట్టాలను పిలిచాడు. కాని పెళ్ళికి వచ్చిన చుట్టాలు ఈ పెళ్ళి వద్దని ప్రమాదమని, కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా యాగి చేశాయి. కార్మికుడు వారిని ఒప్పించాడు.

వారిద్దరి పెళ్ళి చేసి వారిని బాయిలర్ అనే క్రొత్త ఇంట్లో కాపురముంచాడు. వారు అన్యోన్యంగా కాపురం చేయడమే కా…

కోతి పాట్లు - Telugu Moral Stories For Kids And Students

Image
అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెదికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనుల్ని అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరివాళ్ల కళ్లు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది.

ఒకరోజు కోతి ‘నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది’ అని తోడేలును అడిగింది. అప్పుడు తోడేలు ‘ఈ రోజు రాత్రికే నిన్ను తీసుకెళ్తాను. రాత్రికి సిద్ధంగా ఉండు’ అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తె…

తెల్ల ఏనుగు

Image
Telugu Stories For Kids
దండకారణ్యం అనే దట్టమైన అడవులలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు. ఆ ఏనుగుకు తల్లి ఉండేది. దానికి కళ్లు కనిపించేవి కాదు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్లను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. ఒకనాడు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్లినపుడు దానికి మనిషి ఏడుపు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్లి కారణం అడిగింది. అప్పుడు ఆ మనిషి, ‘నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. మూడు రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్లాల్సిన దారి తెలియడం లేదు’ అన్నాడు.

అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. ఆ మనిషి ఊరికి వెళ్లగా అక్కడ రాజభటుడు ‘రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన, రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకి బహుమతి ఇవ్వబడుతుంది’ అని ప్రకటించడం విన్నాడు. ఆ మనిషి తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి, రాజభటులకు సమాచారం అందించాడు.

వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టారు. రాజధాని నగరానికి తెచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాల…

నడ్డి విరిగిన నక్క

Image
అనగనగా ఒక అడవిలో ఒక టక్కరి నక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక పులి ఎదురొచ్చింది. ఆ పులి కూడా చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతోంది. నక్కను చూడగానే పులి దాని వెంటపడింది.

‘బాబోయ్! నా ఆకలి సంగతి సరే. ఈ పులికి దొరికితే నేను దానికి ఆహారమైపోతాను’ అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది. పులి దాన్ని వెంబడించింది. నక్క పరుగెడుతూ పరుగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతోంది. నక్క రాకతో దానికి నిద్రాభంగమై కళ్ళు తెరిచి చూసింది.

‘ఎలుగుబంటి మామా! ఈ చెట్టు కింద ఒక పులి నాకోసం కాచుకుని కూర్చుంది. కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాలు కాపాడు’ అని ప్రాధేయపడింది. ‘సరే’నంటూ  ఎలుగుబంటి తిరిగి నిద్రలోకి జారుకుంది. నక్క ఎప్పుడైనా కిందకు దిగకపోతుందా, దాన్ని తినకపోతానా అని పులి చెట్టు కిందే కాపు కాసింది. ఎంతకీ పులి కదలకపోవడంతో దాని బారినుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది. చివరికి దానికో ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది. ఎలుగుబంటి గాఢనిద్రలో ఉంది. ‘దీన్ని కిందకు తోసేస్తే? అప్పుడు పులి దాన్ని తింటుంది కాబట్టి నన్ను వదిలిపెడుతుంది. అద…

పాము - కోడిపెట్ట

అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి పది గుడ్లు పెట్టి పొదిగింది. ఆ గుడ్లలోంచి బుజ్జి బుజ్జి కోడిపిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకుని కోడిపెట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరుబయటకు తీసుకెళ్లింది. గింజలు ఏరుకుని ఎలా తినాలో నేర్పించసాగింది.

అంతలో హఠాత్తుగా పొద చాటున దాక్కున్న ఒక పాము బుస్సుమని ఇవతలకు వచ్చింది. పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జి బుజ్జి పిల్లల్ని పారిపొమ్మని హెచ్చరికగా అరిచింది. ప్రమాదాన్ని అర్ధం చేసుకుని కోడిపిల్లలు చెల్లాచెదురయ్యాయి. పాపం ఒక కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. పాము దాన్ని నోటితో కరుచుకుని వెళ్ళిపోయింది.

అది మొదలు ఆ పాము పొదల వెనక, చెట్ల చాటున మాటువేయడం, అదను దొరకగానే కోడిపిల్లను పట్టుకుని తినేయడం మొదలుపెట్టింది. తన పిల్లలు ఆహారమవుతూ ఉండటం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది. ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్లింది. కొద్దిదూరంలో ఒక చెట్టు  కింద పాముపుట్ట ఉంది. పాము అందులో నుంచి బయటకు వస్తూ కనిపించింది.

వెంటనే దాని దగ్గరకు వెళ్లి, ‘నువ్వు ప్రతిరోజూ నా పిల్లల్ని తింటున్నావు. నీకిది న్యాయం కాదు. నాకు రెం…

అద్దంలో డబ్బు

Image
సత్తుపల్లి అనే గ్రామంలో బుద్ధయ్య అనే గ్రామస్థుడు భార్యాబిడ్డలతో జీవిస్తున్నాడు. పేరుకు తగ్గట్టు బుద్ధుడంతటి మంచివాడతను.

బుద్ధయ్య ఇంటికి పొరుగున రంగారావు అనే షావుకారు ఉండేవాడు. బుద్ధయ్య ఎంత మంచివాడో రంగయ్య అంత చెడ్డవాడు, స్వార్థపరుడు. బుద్దయ్య మరదలికి పెళ్ళి కుదిరింది. పెళ్ళికి రావటానికి చదివింపులకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు బుద్దయ్యకి. రాత్రంతా ఆ విషయం గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు బుద్ధయ్య.

ఆ  రాత్రి అతనికి ఓ కల వచ్చింది.

ఆ కలలో అతను అప్పుకోసం రంగయ్య దగ్గరకు వెళ్ళి అడిగాడు. అడిగిందే తడవుగా రంగయ్య బీరువాలోంచి డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టాడు.

తెల్లారి లేచాక తనకొచ్చిన కల గురించి భార్యకు చెప్పాడు.

భార్య ఆలోచించి, తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. మనకి ఈ సమయంలో అప్పు ఎవరు ఇస్తారు. నీ కల వల్ల నిజం తెలిసింది. నువ్వు వెంటనే వెళ్ళి రంగయ్యకు మన అవసరం చెప్పి డబ్బు అప్పు అడుగు అంటూ చెప్పింది.

‘సరే ప్రయత్నం చేస్తాను’  అంటూ అప్పటికప్పుడు బయలుదేరి రంగయ్య దగ్గరకు వెళ్ళి తన అవసరం చెప్పి డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు.

‘బుద్ధయ్య! నీకు డబ్బు ఇవ్వాలని ఉంది. కానీ నా చ…

తెలివైన మేక - తెలివితక్కువ తోడేలు

Image
All time best Telugu Moral Stories for Kids And Students

ఒక రోజు గొర్రెలమందతో పాటు ఒక మేక పిల్ల గడ్డిమేస్తోంది. అలా తింటూ తిరుగుతుండగా కొంతదూరంలో తియ్యని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్ళింది. అలా ఆ గొర్రెలమందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించుకోలేనంత ఆనందంగా తిరుగుతోంది. అక్కడే పొంచివున్న ఒక తోడేలు దాని దగ్గరకు వస్తున్న సంగతీ తెలియలేదు.

సరిగ్గా అది దానిమీదకు దూకే సమయానికి గమనించి పరుగుతీయబోయింది. కానీ భయంతో ఆగిపోయి, ‘నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు. తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా!’ అంది.

వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. సరే కొంతసేపు వేచి ఉంటానంది.

ఆ తర్వాత మళ్లీ తోడేలు దగ్గరకి వచ్చి ‘అటూ ఇటూ గంతులేస్తాను. నేను తిన్నది బాగా అరుగుతుంది, అప్పుడు నీకు తినడానికి కష్టముండదు’ అంది.

అందుకు తోడేలు అంగీకరించింది. అలా గంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది. తోడేలు దగ్గరకు వెళ్లి ‘నా మేడలో గంట తీసి వాయిస్తుండు. నేను మరింత వేగంగా గంతులేస్తూ ఆడతాను’ అంది. తోడేలు సరేనని గంటతీసి గట్టిగా వాయించడం మొదలుపెట్టింది.

అక్కడికి సమీపంలో…

పిసినారి కల

Image
Telugu Moral Stories For Kids


పార్వతీపురంలో లక్ష్మయ్య అనే జమీందారు వుండే వాడు. అతను చాలా ధనికుడు. వందల ఎకరాల భూమి గల లక్ష్మయ్య చాలా పిసినారి కూడా. తనకున్న ధనంతో పేదవారికి తన కింద పని చేసే రైతులకు సహాయం చేసే ఆలోచనే అతనికి లేదు. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలనే ఆలోచన ఎప్పుడూ అతని మనసులో ఉండేది. ఒకనాడు తెల్లవారుజామున లక్ష్మయ్య గాఢ నిద్రలో వున్నాడు. అతనికి ఒక కల వచ్చింది.

ఆ కలలో తన పొలాన్ని రైతు దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డుకుంది. అక్కడే ఉన్న లక్ష్మయ్య తవ్వి చూడగా అక్కడ ఒక రాగి బిందె కనిపించింది. బిందె తెరిచి చూడగా అందులో మేలైన బంగారు ఆభరణాలు, నాణేలు వున్నాయి. లక్ష్మయ్య సంబరానికి అంతే లేకుండా పోయింది. ‘ఈ బిందెను నా పొలంలో ఎవరు దాచారు? నా పూర్వీకులా లేక ఎవరైనా దొంగలా?’ అని ఆలోచించాడు.

‘నాకు ఈ బిందె దొరికిన విషయం రాజుకు తెలిసినా లేక దొంగలకు తెలిసినా ప్రమాదం’ అనుకున్నాడు. వెంటనే పొలం దున్నే రైతు సహాయంతో ఆ బిందెను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రైతు ‘అయ్యా ఇంకో పది రోజులలో నా కూతురి పెళ్ళి వుంది. మీకు దొరికిన ఆభరణాలలో ఒక చిన్న ఆభరణం ఇస్తే నా కూతురికి పెళ్లి కానుకగా ఇస్తాను. మీ దగ్గర ఎంతో ధనం ఉంది కదా…

గడ్డిమోపులో కుక్క

Image
Neethi Kathalu In Telugu


కాంచీపురం అనే  ఊరిలో రాజయ్య అనే రైతు ఉన్నాడు. అతడి దగ్గర అనేక పశువులు ఉండేవి. ఇంటిదగ్గర కాపలాకు ఒక కుక్క కూడా ఉండేది. పశువుల కోసం పొలంలో పశువుల పాక ఉండేది. అలాగే అవి నీరు తాగేందుకు ఓకే పెద్ద నీటితొట్టె, దానికి దగ్గరలోనే గడ్డిమోపు ఉండేది. చక్కగా పశువులు పగలంతా పనిచేసి, రాత్రి అక్కడ కునుకు తేసేవి. పాలిచ్చే పశువులకు ఆ గడ్డితోపాటు బాగా దాణా పెట్టేవాడు. పాలికాపు రాజయ్య వాటిని ఏ లోటు రాకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండేవాడు.

ఒకరోజు రైతుతో పాటు అతడి కుక్క కూడా పొలానికి వచ్చింది. పశువులకు రైతు చేసిన సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయింది కుక్క. ఆ తర్వాత దానికి ఒళ్లు మండింది. ‘తనకింత ముద్ద పడేసి వాటికి అన్ని సదుపాయాలు చేసాడా?’ అనుకుని కోపంతో కుతకుత ఉడికిపోయింది. తన కోపం ప్రదర్శించేందుకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. రైతు వెళ్లిపోగానే పశువులు గడ్డి తినడానికి వెడితే, వాటిని తిననివ్వకుండా బాగా మొరగడం సాగించింది. దాంతో పశువులు భయపడి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపాయి. ఉదయాన్నే పాలికావు వచ్చాడు. గడ్డిమోపు చుట్టూ పశువులు దీనంగా, నీరసంగా నిలబడడం చూసాడు. గడ్డిమోపు మీద కుక్క హాయిగా…

ఆశపోతు నక్క

Image
అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ నక్క ఉండేది. దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాని కంటబడకుండా తప్పించుకుని తిరగసాగాయి. దాంతో అది ఆకులు, అలములు తింటూ ఎలాగోల బతకసాగింది. ఓ రోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగ దానికి ఒక పిల్లి ఎదురై ‘ఎలా వున్నావు పెద్దమ్మ!' అని పలకరించింది.

నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది. పిల్లికి నక్క మీద జాలేసింది.

‘అలా అయితే నాతో రా పెద్దమ్మ. ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట్లో విందు జరుగుతోంది. ఎవరికంటా పడకుండ ఆ ఇంట్లో దూరి కావలసినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయట పడదాం’ అంటూ వెంట తీసుకెళ్లింది.

రెండూ కలిసి విందు జరిగే ఇంటి కిటికీలోంచి నెమ్మదిగా లోపలికి దూరాయి. పిల్లి ఒక్కొక్క పదార్దాన్నీ కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది. నక్క మాత్రం అత్యాశతో సుష్టుగా లాగించింది. ఇంతలో ఏదో అలికిడి కావడంతో పిల్లి చెంగున కిటికీలోనుంచి దూరి బయటపడింది. నక్క కూడా ప్రయత్నించింది కానీ వీలు కాలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉండటాన కిటికీలో నుంచి సులభంగా దూరగలిగింది.ఇప్పుడేమో పొట్టపగిలేట్టు తినడంతో కిటికీలో పట్టలేదు. ఇంతలో ఇంటివాళ్ళు రావడంతో ఓ ఉపాయం ఆలో…

ఆకతాయి శిష్యుడు

గణపతి స్వామి ఊరూరా తిరుగుతూ తనకు తెలిసిన విషయాలను ప్రజలకు ప్రబోధిస్తుండేవారు. ప్రజలు ప్రేమతో ఇచ్చే దక్షిణను ఆయన ఖర్చుల కోసం స్వీకరించేవారు. అలా ప్రజలు ఇచ్చిన డబ్బులన్నీ ఆయన వద్ద ప్రోగయ్యాయి. వాటిని మూటగట్టుకుని ఆయన బొడ్డులో దోపుకునేవారు. దీనిని గమనించిన ఓ ఆకతాయి ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేశాడు.

ఓ చెట్టుకింద సేదతీరుతున్న గణపతి స్వామిని కలిసిన ఆ ఆకతాయి 'అయ్యా! నేనొక అనాథను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారంటే, మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను' అని వేడుకున్నాడు. అతడి మాటలు నమ్మశక్యంగా అనిపించటంతో సరేనని అంగీకరించిన గణపతి స్వామి 'సరే, అలాగే కానీ... ఇదిగో ఈ జోలెను భుజానికి తగిలించుకో, వేరే ఊరికి వెళదాం' అన్నాడు.

తన పథకం పారినందుకు ఎంతగానో సంతోషించిన ఆ ఆకతాయి గణపతి స్వామికి శిష్యుడిగా చేరిపోయాడు. ఇక అప్పటినుంచి ప్రతిరోజూ ఊరూరా తిరుగుతూ రాత్రివేళల్లో ధర్మసత్రాలలో బసచేస్తూ గడిపారు ఆ ఇద్దరు గురు శిష్యులు. ఎవరి జోలెను వారిప్రక్కనే పెట్టుకుని నిద్రపోయేవారు.

అలా కొన్ని రోజులు గడచిన తరువాత గణపతి స్వామి గాఢ నిద్రలో ఉండగా ఆయన డబ్బుల మూట కోసం శిష్యుడు వెదికాడు. ఎంత వెతికినా కని…

పులితోలు - గాడిద

Image
పూర్వం ఒక గ్రామంలో విలాసుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. అయితే బట్టల మూటలు మోసే ఓపిక లేక ఏలాగోలా చేసి ఒక గాడిదను కొనుక్కున్నాడు. గాడిదను కొనగానే సరిపోతుందా..? దాన్ని మేపాలంటే ఈ చాకలివాడి తలప్రాణం తోకకు వచ్చింది. గాడిదను మేపాలంటే డబ్బులు ఖర్చయిపోతాయన్న బెంగతో చాకలివాడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు.

అదేంటంటే...బాగా పాతదైపోయిన పులితోలును ఒకదాన్ని సంపాదించిన అతడు, దాన్ని గాడిదపై కప్పి, రాత్రుళ్లు గ్రామస్తుల చేలల్లో వదిలివెసేవాడు. ఆ గాడిద చేలల్లో తనకు ఇష్టమైన ఆహారాన్ని కడుపారా తిని చాకలి ఇంటికి వెళ్లిపోయేది. పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లో కావలి ఉండే గ్రామస్తులు... "అయ్యబాబోయ్.. పులి వచ్చింది" అని భయపడి పారిపోయేవారు.
భయం వల్ల గ్రామీణులెవరూ ఆ పులిని ఏంచేయగలం అంటూ ఊరకుండిపోయారు. అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ఒక యువకుడికి మంచి ఆలోచన తట్టింది. దాంతో అతడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికే తన పెంపుడు గాడిదలను వెంటబెట్టుకుని పంటపొలానికి కాపలాగా వెళ్ళాడు. ఆ రాత్రి కూడా విలాసుడి గాడిద.. యజమాని కప్పిన పులితోలు ముసుగులో చేలల్లో పడి, పైరుల్ని మేయసా…

అమ్మాయి కలలు

Image
అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది. ఒక రోజు ఆవు మామూలుగా కన్నా కొంచం యెక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాల సంతోషించింది.
రోజు తీసుకువెళ్ళే బిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుద్యారింది. దారిలో సంతోశంగా నడుచుకుంటూ యెన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. “ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే నాకు రోజు యెక్కువ ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను. కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని కొంటాను. అలా, అలా కొద్ది రోజులలో నా దెగ్గిర చాలా ఆవులు వుంటాయి.

అవి చూసుకోటాని పాలేరాళ్ళను పెడతాను. నేను రోజూ ఇలా యెండలో ఊరికి వెళ్ళే అవసరం వుండదు. అప్పుడు నేను కూడ తెల్లగా అయిపోతాను. వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాల అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్టు సంతలో గాజులు, గొలుసు కూడ కొనుక్కుంటాను.

ఊరిలో యెవరింట్లోనైనా పెళ్ళి ఐతే, ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి, కొత్త పట్టు చీర కట్టుక…

బుజ్జి మేక - పందిపిల్ల

Image
ఒక రైతు కొన్ని మేకలను, కొన్ని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక  పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లేమో వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటినిండా బురద అంటుకునేది.పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ ‘ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు. కంపు. అవతలికి పో’ అని చీదరించుకునేది.

పంది పిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేక పిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడూ పందిపిల్లను అసహ్యించుకునేది.

‘అమ్మా నాకూ స్నానం చేయించవా. ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు’ అని తల్లితో అంది పందిపిల్ల. ‘చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం. ఇంకోలా ఉండడం మనకు కుదరదు. మన శరీరానికి చెమటపట్టే లక్షణం లేదు. అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి’ అని తల్లి వివరించి చెప్పింది. 

పందిపిల్లకు ఇదంతా అర్ధం చేసుకునే వయసులేదు. కాసేపు వాళ్ళమ్మతో గుణిగింది. అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది.

ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేకపిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండలమీదుండే నక్క ఒకటి ఎలా పసిగట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒం…

ప్రేమలో పడ్డ పులి

Image
అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా వుండేది. ఒక రోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది. అతనిపై యెగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడకి వచ్చింది.
ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది.
కొంచం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడనుంచి వెళ్ళిపోయింది.
ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటునుంచి బయిటికి వచ్చింది.

పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాల భయపడి పోయాడు. పారిపోయే క్షణంలో పులి, “నన్ను చూశి భయపడకండి – నేను మిమ్మల్ని యేమి చేయను. నాకు మీ అమ్మయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకొవాలనుకుంటున్నాను” అంది.
అతను భయంలో కూడా చాల చురుకుగా ఆలోచించాడు.
“నాకు ఇష్టమే, కాని మా అమ్మాయి మీ కోరెలు, మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో – పెళ్ళికి ఒప్పుకోక పోతే?” అన్నాడు.

పులి ఆలోచించకుండా, “మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు, గోళ్ళు తీయించేస్తాను” అంది.
ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు, దంతాలు కోసేసాడు. దంతాలు, గొళ్ళు లేని పులి అంటే భయం వుండదు కదా! కట్టెలతో, రాళ్ళతో, చేతికి అందిన ప్రతీ దానితో పులిని తరిమి తరిమి కొట్…

దేవుడికి ఉత్తరం

Image
ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బోజనానికి మిగతా అవసరాలకు ఇరుగుపొరుగు వాళ్ళు సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది.

ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. 'నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని' ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు.

దేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బావుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు. 'దేవుడా! నాకెవరు లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నామీద జాలి చూపి పుస్తకాలు కొనుకునేందుకు 100 రూపాయలు పంపించు' ... చిరునామా రాయాల్సిన చోటులో 'దేవుడు, స్వర్గం' అని రాసి పోస్ట్‌బాక్స్‌లో ఆ ఉత్తరం వేశాడు.పోస్ట్‌మాన్‌ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్టాఫీసుకు తీసుకెళ్ళాడు. అక్కడి పోస్టుక్లర్కు ఆ ఉత్తరంపైన ఉన్న అడ్రసు చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్టుమాస్టర్‌కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్టుమాస్టర్‌ హృదయాన్ని తాకింది.…

వెర్రిబాగుల రవి

Image
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు. వాళ్లకు ఒక కొడుకు. వాడి పేరు రవి. ఒట్టి అమాయకుడు. వాళ్లకు రెండు మేకలు ఉండేవి. ఒకరోజున రవి వాళ్ల నాన్న "ఒరేయ్ రవీ! ఇవ్వాళ మేకలను మేపడానికి వాటిని అడవికి నువ్వు తోలుకెళ్లు" అని చెప్పాడు.`సరే'నన్న, రవి చద్ది కట్టుకొని, కొన్ని ఉలవలను బట్టలో మూట కట్టుకొని మేకలను అడవికి తోలుకుపోయాడు. మేకలు తమ మానాన తాము గడ్డి మేస్తుంటే, బాగా పెరిగిన ఒక తుమ్మ చెట్టుకింద కూర్చుని, రవి తనతోపాటు తెచ్చుకున్న ఉలవలను పటపటమని నమలడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి అతని రెండు మేకలూ నేలరాలిన ఎండు తుమ్మకాయలను కరకరా నమలుతున్నాయి. ఆ శబ్దం విన్న రవి మేకలు రెండూ తనను వెక్కిరిస్తున్నాయనుకొని వాటిని అవతలికి తోలాడు.

ఏమీ తెలియని మేకలు మళ్ళీ వచ్చాయి! అక్కడ పడివున్న తుమ్మకాయలను కొరుకుతున్నాయి మళ్లీ! ఈ సారి రవికి పట్టరాని కోపం వచ్చింది. తనతో తెచ్చుకున్న కొడవలితో మేకలు రెండింటినీ నరికేశాడు. ఇక వాటిని అలానే ఇంటికి తీసుకెళ్లాడు. రవి తండ్రి చాలా బాధ పడ్డాడు కానీ ఏమీ చేయలేక ఊరుకున్నాడు.ఆ మరునాడు రవి నట్టింట్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు. పైన వాసాలమధ్యలో ఒక ఎలుక అటూ ఇటూ తిరుగు…

ప్రాణం తీసిన గొప్ప

ప్రాణం తీసిన గొప్ప 
అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!

ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ!

ఇలా అన్ని పురుగులూ ఏవేవో గొప్పలు చెప్పుకొంటుంటే, ఓ మిణుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి వూరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి! నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను. అంతే కాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా వుంటాను. "ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలూ" అనుకొంటారు అందరూ! నన్ను చూసి, ఎంత అందంగా వుందో అని అందరూ ముచ్చటపడతారు.అంటూ గిర్రున తిరిగి మిలమిల మెరిసి పోయింది.

మిణుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన…

చీమ - రాజు

Image
చీమ - రాజు 
మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు.
ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక…

పొగరుబోతు మేకలు

Image
పొగరుబోతు మేకలు


ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉంది. అది చాలా నిటారుగా ఉంది. ఆ కొండ మీదకు వెళ్ళటానికి గానీ, రావటానికి గానీ ఒకటే దారి. ఆ దారి వెంట మేకలు, గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేతమేసి తిరిగి వస్తూ ఉండేవి. ఒకరోజు రెండు మేకలు ఒకటి పైనుండి కిందకు, రెండవది కిందనుండి పైకి వస్తూ అవి కొండ మధ్యకు చేరాయి. రెండింటికీ తప్పుకోవడానికి దారి లేదు. ఏదో ఒకటి వెనక్కి నడవటం తప్ప వేరే మార్గం లేదు. ఒక మేక రెండోదాంతో "తన దారికి అడ్డం తప్పుకో"మన్నది. "ఈ సన్నటి దారిలో వెనకకు వెళితే లోయలో పడిపోతానని నీకు తెలియదా! నువ్వే వెనుకకు వెళ్ళటం తేలిక. నన్నే ముందు పోనివ్వు!" అన్నది రెండవది.

"అది జరగని పని నీకు కిందకు వెళ్ళటం ఎంత ప్రమాదమో నాకు వెనుకకు, పైకి పోవటం కూడా అంతే ప్రమాదం" అన్నది మొదటి మేక. "ఒక పని చెయ్యి. ఈ దారిలో నువ్వు నేలకు వదిగి పడుకో నేను నీ మీద నుంచి దాటి వెళతాను. ఇంతకు తప్ప వేరే మార్గం లేదు" అన్నది రెండవ మేక. "నేను చస్తే ఆ పని చెయ్యను. నువ్వు నా మీదనుంచి దాటి వెళితే, నా శవం మీద నుంచి దాటి వెళ్ళినట్లే... "అన్నది ఆవేశంగా మొదటి మేక. ఆ విధంగా ఆ రెండింటికి మాటా …

పల్లెటూరు ఎలుక - పట్టణం ఎలుక

Image
పల్లెటూరు ఎలుక - పట్టణం ఎలుక


ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు.
పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దెగ్గిర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద చేసింది.

పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది.
ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయ్యారు అయ్యింది. రెండు ఎలుకలూ రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి.

పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంట గదికి తీసుకువెళ్ళింది. ఆకడ ఇంట్లోవాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది.
పల్లెటూరి ఎలుక, “నువ్వు నిజమే చెప్పావు! మా వూరిలో ఎప్పుడొ పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది” అంటూ ముందు ఏమి తిందామా అని …