తెలివైన మేక - తెలివితక్కువ తోడేలు

All time best Telugu Moral Stories for Kids And Students


telugu moral stories
Telugu Moral Stories

ఒక రోజు గొర్రెలమందతో పాటు ఒక మేక పిల్ల గడ్డిమేస్తోంది. అలా తింటూ తిరుగుతుండగా కొంతదూరంలో తియ్యని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్ళింది. అలా ఆ గొర్రెలమందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించుకోలేనంత ఆనందంగా తిరుగుతోంది. అక్కడే పొంచివున్న ఒక తోడేలు దాని దగ్గరకు వస్తున్న సంగతీ తెలియలేదు.

సరిగ్గా అది దానిమీదకు దూకే సమయానికి గమనించి పరుగుతీయబోయింది. కానీ భయంతో ఆగిపోయి, ‘నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు. తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా!’ అంది.

వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. సరే కొంతసేపు వేచి ఉంటానంది.

ఆ తర్వాత మళ్లీ తోడేలు దగ్గరకి వచ్చి ‘అటూ ఇటూ గంతులేస్తాను. నేను తిన్నది బాగా అరుగుతుంది, అప్పుడు నీకు తినడానికి కష్టముండదు’ అంది.

అందుకు తోడేలు అంగీకరించింది. అలా గంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది. తోడేలు దగ్గరకు వెళ్లి ‘నా మేడలో గంట తీసి వాయిస్తుండు. నేను మరింత వేగంగా గంతులేస్తూ ఆడతాను’ అంది. తోడేలు సరేనని గంటతీసి గట్టిగా వాయించడం మొదలుపెట్టింది.

అక్కడికి సమీపంలో వున్న గొర్రెల కాపరి అది విని పరుగున వచ్చాడు. అతనితో పాటు వచ్చిన కుక్కలు వెంటపడడంతో తోడేలు అడవిలోకి పరుగు తీసింది.

నీతి: ఉపాయంలో అపాయం పరార్

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు