గడ్డిమోపులో కుక్క

Neethi Kathalu In Telugu


Neethi kathalu in telugu
Neethi Kathalu In Telugu


కాంచీపురం అనే  ఊరిలో రాజయ్య అనే రైతు ఉన్నాడు. అతడి దగ్గర అనేక పశువులు ఉండేవి. ఇంటిదగ్గర కాపలాకు ఒక కుక్క కూడా ఉండేది. పశువుల కోసం పొలంలో పశువుల పాక ఉండేది. అలాగే అవి నీరు తాగేందుకు ఓకే పెద్ద నీటితొట్టె, దానికి దగ్గరలోనే గడ్డిమోపు ఉండేది. చక్కగా పశువులు పగలంతా పనిచేసి, రాత్రి అక్కడ కునుకు తేసేవి. పాలిచ్చే పశువులకు ఆ గడ్డితోపాటు బాగా దాణా పెట్టేవాడు. పాలికాపు రాజయ్య వాటిని ఏ లోటు రాకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండేవాడు.

ఒకరోజు రైతుతో పాటు అతడి కుక్క కూడా పొలానికి వచ్చింది. పశువులకు రైతు చేసిన సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయింది కుక్క. ఆ తర్వాత దానికి ఒళ్లు మండింది. ‘తనకింత ముద్ద పడేసి వాటికి అన్ని సదుపాయాలు చేసాడా?’ అనుకుని కోపంతో కుతకుత ఉడికిపోయింది. తన కోపం ప్రదర్శించేందుకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. రైతు వెళ్లిపోగానే పశువులు గడ్డి తినడానికి వెడితే, వాటిని తిననివ్వకుండా బాగా మొరగడం సాగించింది. దాంతో పశువులు భయపడి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపాయి. ఉదయాన్నే పాలికావు వచ్చాడు. గడ్డిమోపు చుట్టూ పశువులు దీనంగా, నీరసంగా నిలబడడం చూసాడు. గడ్డిమోపు మీద కుక్క హాయిగా నిద్రపోతుంది. వెంటనే అతడు తన చేతిలో గల కర్రతో దాన్ని చితకబాదాడు. దాంతో దానికి బుద్ధి వచ్చి తిరిగి మళ్లీ పొలానికి వెళ్లలేదు.

నీతి: తనకు ఉపయోగపడకపోయినా ఇతరులకు ఉపయోగపడకుండా చేయాలనే కుత్సిత బుద్ధిని కలిగివుండకూడదు.

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు