పిసినారి కల

Telugu Moral Stories For Kids


Telugu Moral Stories
Telugu Moral Stories


పార్వతీపురంలో లక్ష్మయ్య అనే జమీందారు వుండే వాడు. అతను చాలా ధనికుడు. వందల ఎకరాల భూమి గల లక్ష్మయ్య చాలా పిసినారి కూడా. తనకున్న ధనంతో పేదవారికి తన కింద పని చేసే రైతులకు సహాయం చేసే ఆలోచనే అతనికి లేదు. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలనే ఆలోచన ఎప్పుడూ అతని మనసులో ఉండేది. ఒకనాడు తెల్లవారుజామున లక్ష్మయ్య గాఢ నిద్రలో వున్నాడు. అతనికి ఒక కల వచ్చింది.

ఆ కలలో తన పొలాన్ని రైతు దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డుకుంది. అక్కడే ఉన్న లక్ష్మయ్య తవ్వి చూడగా అక్కడ ఒక రాగి బిందె కనిపించింది. బిందె తెరిచి చూడగా అందులో మేలైన బంగారు ఆభరణాలు, నాణేలు వున్నాయి. లక్ష్మయ్య సంబరానికి అంతే లేకుండా పోయింది. ‘ఈ బిందెను నా పొలంలో ఎవరు దాచారు? నా పూర్వీకులా లేక ఎవరైనా దొంగలా?’ అని ఆలోచించాడు.

‘నాకు ఈ బిందె దొరికిన విషయం రాజుకు తెలిసినా లేక దొంగలకు తెలిసినా ప్రమాదం’ అనుకున్నాడు. వెంటనే పొలం దున్నే రైతు సహాయంతో ఆ బిందెను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రైతు ‘అయ్యా ఇంకో పది రోజులలో నా కూతురి పెళ్ళి వుంది. మీకు దొరికిన ఆభరణాలలో ఒక చిన్న ఆభరణం ఇస్తే నా కూతురికి పెళ్లి కానుకగా ఇస్తాను. మీ దగ్గర ఎంతో ధనం ఉంది కదా. పైగా ఇంత పెద్ద బంగారు ఆభరణాల బిందె దొరికింది. ఒక చిన్న ఆభరణం ఇస్తే మీకు పుణ్యం దొరుకుతుంది’ అని బతిమిలాడాడు.

లక్ష్మయ్య ‘ఈ రైతుకు ఒక చిన్న గొలుసు ఇచ్చి నాకు బిందె దొరికిన విషయం ఎవ్వరికీ చెప్పకు అని మాట తీసుకుంటే సరి, లేదా దీన్ని రాజ భటులో, దొంగలో వచ్చి ఈ బంగారాన్ని తీసుకుపోయే అవకాశం వుంది’ అని రైతుకి ఒక చిన్న గొలుసు ఇవ్వబోయాడు. ఇంతలో అతని భుజం మీద ఎవరో చేయి పెట్టినట్టు అనిపించింది. హఠాత్తుగా మెలుకువ వచ్చింది. లేచి చూడగా అతని భార్య ఎదుట నిలబడి వుంది. లక్ష్మయ్య భార్యతో ‘నువ్వు నన్ను లేపి మంచి పని చేశావు లేకపోతే నేను కలలో ఒక రైతుకి బంగారు గొలుసు ఇచ్చేవాడిని’ అన్నాడు!  చూశారా? ఒక పిసినారి కలలో కూడా పిసినారే! కలలో కూడా ఒకరికి ఒక చిన్న వస్తువు ఇవ్వడానికి కూడా ఇష్టపడడు.

నీతి: దుర్గుణాలలో పిసినారితనం ఎంతో మేలు.

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు