తెల్ల ఏనుగు

Telugu Stories For Kids


దండకారణ్యం అనే దట్టమైన అడవులలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు. ఆ ఏనుగుకు తల్లి ఉండేది. దానికి కళ్లు కనిపించేవి కాదు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్లను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. 

Telugu stories for kids
Telugu Stories For Kids

 
ఒకనాడు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్లినపుడు దానికి మనిషి ఏడుపు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్లి కారణం అడిగింది. అప్పుడు ఆ మనిషి, ‘నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. మూడు రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్లాల్సిన దారి తెలియడం లేదు’ అన్నాడు.

అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. ఆ మనిషి ఊరికి వెళ్లగా అక్కడ రాజభటుడు ‘రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన, రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకి బహుమతి ఇవ్వబడుతుంది’ అని ప్రకటించడం విన్నాడు. ఆ మనిషి తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి, రాజభటులకు సమాచారం అందించాడు.

వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టారు. రాజధాని నగరానికి తెచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. కానీ ఆ తెల్ల ఏనుగు ఒక్కదానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు? అని బాధపడింది. ‘ఏనుగు ఏమీ తినడం లేదు’ అనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగుని పలకరించారు. అప్పుడు ఏనుగు ‘నాకు ఈ రాజభోగాలు వద్దు, అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవడంలోనే నాకు సుఖముంటుంది’ అని చెప్పింది.

ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది.

నీతి: తల్లిదండ్రులు దైవంతో  సమానం.

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు