Posts

ఓడి గెలిచిన ఎద్దు | Kids Moral Stories In Telugu for Kids

 అవంతీపురం అనే నగరంలో రామా చారి అనే బీదవాడు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తల్లా ఒక పెంకుటిల్లు, ఒక ఎద్దు. దూడగా ఉన్నప్పుడు దాని తల్లి చనిపోతే, రామాచారి ఎంతో ప్రేమగా దాన్ని పెంచాడు. 'నంద కుమారా!' అని దాన్ని ఆప్యాయంగా పిలిచుకునేవాడు రామాచారి. రామాచారి పేదరికాన్ని గమనించిన ఎద్దు 'తను పస్తులుండి నా కడుపు నింపడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఈ మహానుభావుడి రుణం తీర్చుకోవాలి' అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు అది రామాచారితో ''అయ్యా! మీకు తెలుసు, మీ నీడలో పెరిగిన నేను ఎంత బలశాలిగా తయారయ్యానో! నాలా బరువులు లాగే వారు ఈ రాజ్యంలోనే లేరు. మీరు భూస్వామి నరేంద్రభూపతిని కలుసుకుని, నా నందకుమారుడు యాభై నిండు బండ్లను లాగగలడని పందెం కాయండి!'' అని చెప్పింది. రామాచారి నరేంద్రభూపతి దగ్గరకు వెళ్ళి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ నందకుమారుడి బలం గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు తన ఎద్దు యాభై బండ్లు లాగగలదని పందెం కాశాడు. అతని మాటలు విని, ఆశ్చర్యపోయిన నరేంద్రభూపతి వెయ్యి రూపాయల పందానికి సిద్ధపడ్డాడు. ఆ పందెం గురించి తెలిసిన ఆ గ్రామ ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల జనాలు కూడా పోగయ్యారు. ధాన్యం నింపి

నాలుగు పెట్టెలు | Telugu Neethi Kathalu

Image
ఒకరోజు మర్యాద రామన్న దగ్గరికి ఒక విచిత్రమైన తగవు వచ్చింది. Telugu Moral Stories నలుగురు అన్నదమ్ముల మధ్య తగవు. ఆ నలుగురన్నదమ్ముల తగవంటే ఆస్తి తగవు కాక మరేం అయి ఉంటుంది. ఆ నలుగురన్నదమ్ముల తండ్రి చనిపోతూ ఓ వెండిపెట్టె పెద్దవాడి చేతిలో పెట్టి దానితోపాటు ఓ పత్రం కూడా అందించి పెద్దల సమక్షంలో ఆ పత్రంలో ఉన్న ప్రకారం ఆస్తిని పంచుకోమని చెప్పి చనిపోయాడు. ఆ ప్రకారమే ఆ పత్రంలో ఉన్న ప్రకారం ఆస్తులు పంచుకుందామని చూస్తే అందులో ఒకటవ పెట్టె పెద్దవాడికి రెండవది రెండవవాడికి మూడవది మూడవవాడికి నాలుగవది నాలుగవవాడికి అని రాసి ఉంది. తండ్రి తనకిచ్చిన వెండిపెట్టెను చూస్తే దానిమీద కాటుకతో ఒకటి అని రాసి ఉంది. అది తెరిస్తే లోపల మరొక పెట్టె మీద రెండు అని రాసి ఉంది. అలా పెట్టెలోపల పెట్టెలు ఉన్నాయి. ఎవరి పెట్టెను వాళ్ళు పంచుకున్నారు. పెద్దవాడి పెట్టెలో ఒక కలం తప్ప మరేం లేదు. రెండవ వాడి పెట్టెలో చిన్న ఇటుక ముక్క తప్ప మరేమి లేదు. మూడవవాడి పెట్టెలో చిన్న మట్టి బెడ్డ మాత్రమే ఉంది. నాలుగవ పెట్టెలో రెండు రత్నాలు ఉన్నాయి. ఆ నలుగురికీ తండ్రి తమకి ఆస్తిని ఎలా పంచాడో అర్థం కాలేదు. అందుకని ఆ నాలుగుపెట్టెలు తీసుకుని రామన్న దగ్గరక

నాన్న ! నీతో ఓ గంట | Telugu Stories With Moral For Kids And Students

Image
Telugu Stories With Moral ఒక తండ్రి రోజులా చీకటి పడ్డాక చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఆఫీసులో పని ఎక్కువగా ఉండడంతో అలసిపోయి చికాకుగా ఉన్నాడు. తండ్రి కోసం అతని పది సంవత్సరాల కొడుకు గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉన్నాడు.   ‘నాన్నా, నిన్నో ప్రశ్న అడగనా?’ సంశయంగా అడిగాడు కొడుకు. ‘ఏమిటి?’ ‘గంటకు  నువ్వెంత సంపాదిస్తావు?’ కొడుకు ప్రశ్న వినగానే తండ్రికి చాలా కోపం వచ్చింది. ‘చిన్న పిల్లాడివి నీకెందుకు? అయినా నీకు సంబంధంలేని విషయం ఇది’ ‘నాకు తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ చెప్పు నాన్నా!’ కొడుకు ప్రాధేయపూర్వకంగా అడిగాడు. తండ్రి మనసులో లెక్కించి చెప్పాడు. ‘నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే… గంటకి రెండొందలు’. ఒక్క క్షణం ఆ కుర్రాడు ఏదో ఆలోచించి ‘అయితే నాన్నా నాకు ఒక వంద రూపాయలు ఇవ్వవా?’ అన్నాడు. దానితో తండ్రి తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కొడుకుని ఒక చెంపదెబ్బ కొట్టి ‘నీ గదిలోకి వెళ్ళిపో’ అంటూ గద్దించాడు. కుర్రాడు మౌనంగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. చాలాసేపటి వరకు తండ్రికి కోపం తగ్గలేదు. ‘డబ్బులు మాములుగా అడగవచ్చు కదా! ఎంత ధైర్యం నా సంపాదన కనుక

దయ్యం - Dayyam Telugu Moral Story

Image
దయ్యం Telugu Moral Story మున్నావాళ్ళిల్లు ఓ కొండ పై ఉంది. ఆ ఇంటి వెనక చిట్టడవి ఉంది. బయట తిరక్కుండా ఇంట్లోనే ఆడుకోవాలని మున్నా వాళ్ళ అమ్మా నాన్నా చెప్పారు. కానీ మున్నాకి ఆ అడవిలో ఏముందో చుడాలని కోరిక. తను చదివే కథల్లో వున్నట్టు ఆ అడవిలో జంతువులు ఉంటాయి, అవి మాట్లాడతాయి. తనతో స్నేహం చేస్తాయి. అనుకునే వాడు. ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాడు. అడవిలో దయ్యం వుంది. అది మనుషులని తినేస్తుంది. అని చెప్పింది వాళ్ళ అమ్మ. మున్నాకి భయం వేసింది. ఐనా కుడా అమ్మ వూరికే అలా అంటుంది లెమ్మని అనుకున్నాడు. ఓ రోజు మున్నా ఇంట్లో ఎవరికీ తెలియకుండా అడవిలోకి వెళ్ళాడు. కాస్త దూరం వెళ్ళే సరికి దూరంగా ఏదో నల్లటి ఆకారం అటు ఇటూ కదులుతూ కనిపించింది. ‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో. కాస్త ధైర్యం తెచ్చుకుని దగ్గరకి వెళ్ళి పరీక్షించాడు. గాలికి ఊగే ఒక చెట్టు నీడ అది. ‘హమ్మయ్య ఇది దయ్యం కాదు’ అనుకున్నాడు. కాసేపటికి వెనకగా ఎవరో వస్తున్నట్టు ఎండుటాకుల శబ్దం వినిపించసాగింది. ‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో. ఓ చెట్టు చాటుకి వెళ్ళి వచ్చేది ఎవరా అని చూడసాగాడు. తీరా ఆ వచ్చింది ‘చోటు’. చోటు వాడి కుక్కపిల్ల. ము

గుడ్డి రాబందు - జిత్తుల మారి పిల్లి

Image
Telugu Moral Stories ఒక నది ఒడ్డున ఒక గుడ్డి రాబందు నివసించేది. ఎన్నో ఇతర పక్షులూ అదే చెట్టుపైన జీవించేవి. పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో కొంత రాబందుకు కూడా ఇచ్చేవి. బదులుగా, ఆ పక్షులు గూళ్లలో లేనపుడు వాటి పిల్లలను రాబందు చూసుకునేది. ఒకరోజు ఒక పిల్లి చెట్టుమీద ఉన్న పక్షి కూనలను గమనించింది. ఎలాగైనా వాటిని ఆరగించాలని అనుకుంది. కాని పిల్లి రావడం గమనించిన పక్షి కూనలు అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విన్న గుడ్డి రాబందు "ఎవరు, ఎవరక్కడా?" అని అరిచింది. రాబందును చూసిన పిల్లికి ప్రాణం పోయినంత పనయింది. 'నా పనైపోయిందిరా దేవుడా. ఈ రాబందు నన్ను వదలుదురా బాబు! దీన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి' అని అనుకుంటూ, " నేనే...నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను గురువా" అన్నది పిల్లి గట్టిగా. రాబందు ఎవరు నువ్వు? అని అడిగింది. "నేను పిల్లిని" అని జవాబిచ్చింది పిల్లి. "వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను" అని అరిచింది రాబందు. రాబందు అరుపులకు భయపడ్డ పిల్లి "గురూ్! నా మాట విను తర్వాత నన్ను చంపినా సరే" అని ప్రాధేయపడింది. "మరి నువ్వెంద

ముసలి ఎద్దు - Telugu Stories With Moral

Image
ముసలి ఎద్దు సీతాపతి అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా చాలా ఉత్సాహంగా పొలంపనులు చేసి, బండిలాగి సీతాపతికి ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. సీతాపతి ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును తెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి, కుడితిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డివేసి ఉరుకునేవాడు. Telugu Stories With Moral క్రమంగా అది కూడా దండగ అనుకున్న సీతాపతి ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దుని విప్పి ‘నీకు పని చేసే వయసు అయిపోయింది. శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకో’ అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు క్రిష్ణ అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. ముసలి ఎద్దు  తన జాలి గాథ వినిపించింది. క్రిష్ణ ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని సీతాపతి ఇంటికి వెళ్లి ‘ఈ ఎద్దు నీదేకదూ!’ అని అడిగాడు. అవునన్నాడు సీతాపతి. ‘దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యి వరహాలు ఇస్తాను.’ అన్నాడు క్రిష్ణ. సీతాపతి ఆశ

పిసినారి కనకయ్య - Telugu Stories For Kids With Moral

Image
పిసినారి కనకయ్య  కనకయ్య వొట్టి లోభి , ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు. "సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! Telugu Stories For Kids రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి. కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి